Radha Review , Rating | Telugu movie review

రాధ రివ్యూ | Radha Review 

 

Radha Review  | Radha Review 

 

 తారాగణం: శర్వానంద్‌.. లావణ్య త్రిపాఠి.. అక్ష.. జయ ప్రకాష్‌రెడ్డి.. తనికెళ్ల భరణి.. కోట శ్రీనివాసరావు..సప్తగిరి.. రవికిషన్‌ తదితరులు. 

ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు 

డైరెక్టర్: చంద్రమోహన్‌ 

వరుస హిట్లతో దూసుకుపోతున్న శర్వానంద్.. శతమానం భవతి తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు సీరియస్ క్యారెక్టర్లు చేసిన శర్వా.. ఇప్పుడు పక్కా కమర్షియల్ ఫార్ములాతో వచ్చాడు. శ్లోకం కావాలా? సారాంశం కావాలా? అంటూ పోలీసు అవతారమెత్తాడు. మరి ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా ఉందా? శర్వాకి మరో హిట్ వచ్చిందా?  

స్టోరీ: చిన్న‌ప్పుడే పోలీసు కావాల‌ని డిసైడ్ అవుతాడు రాధాకృష్ణ (శ‌ర్వానంద్‌). పోలీసు కాక ముందే పోలీసులు చేయాల్సిన ప‌నుల‌న్నీ చేసేస్తుంటాడు. ఒక‌సారి కర‌డుగట్టిన నేర‌గాళ్ల‌ని ప‌ట్టిస్తే.. సాక్షాత్తూ డీజీపీనే రాధాకృష్ణ‌ని పిలిచి పోలీసు ఉద్యోగం ఇస్తాడు. అప్ప‌ట్నుంచి దుష్ట శిక్ష‌ణ విష‌యంలో మ‌రింత‌గా చెల‌రేగిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఐతే నేరాలు జరగను ప్రాంతానికి పోస్టింగ్ ఇవ్వడంతో  అసంతృప్తిగా ఉన్న రాధా.. బాగా నేరాలు జరిగే ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాడు.

ఇంతలోనే రాధాకృష్ణ.. రాధ (లావ‌ణ్య‌త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు. ఎలాగైనా రాష్ట్రానికి సీఎం తానే కావాల‌నుకొన్న హోం మినిస్ట‌ర్ సుజాత (ర‌వికిష‌న్‌) ఓ నేరానికి చేస్తాడు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటి.., ఆ కేసులో రాధా ఎలా వ్యవహిరించాడు. పోలీస్ కు పొలిటికల్ లీడర్ కు మధ్య వార్ఎలా జరిగింది. రాధ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు.  వీళ్లిద్దరి మధ్య వచ్చిన రుక్మిణి(అక్ష) ఎవరు అనేదే మిగతా కథ.

 

ఎలా ఉంది?:  కృష్ణుడు ఆడే లీల‌లు., అమ్మాయిలతో ఆడే ఆటలు, చిలిపి చేష్టలు లాంటి కొన్ని సరదా సీన్లతో ఓ ప్రేమ‌క‌థ‌ని రాసిన డైరెక్టర్.. కథలో హీరో పోలీసు కావ‌టంతో ఆయ‌న‌కో చిన్న కేసుని అప్ప‌జెప్పి సినిమాని తెర‌కెక్కించిన‌ట్లుగా ఉంటుంది. ఓ చిన్న క‌థను తీసుకొని శ‌ర్వానంద్ ను ఎక్కువ‌గా న‌మ్ముకొనే ఈ సినిమా చేసిన‌ట్టున్నారు. తొలి స‌గ‌మంతా పోలీసు ట్రైనింగ్,  అక్క‌డ జ‌రిగే కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలు, ఆ త‌ర్వాత ఉద్యోగం వచ్చాక హీరోయిన్లతో క‌లిసి చేసే రొమాంటిక్ స‌న్నివేశాలతో సాగుతుంది. అక్క‌డ‌క్క‌డ కొన్ని న‌వ్వులు పండుతాయంతే. జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, స‌ప్తగిరి, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులతో క‌లిసి శ‌ర్వానంద్ చ‌క్క‌టి టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్ ను నింపేశారు. సెకండ్ హాఫ్ లో కూడా స్టోరీ పరుగులు పెట్టదు.  సినిమాలో ఉన్న‌ చిన్న క‌థ‌ని చివ‌రిదాకా కాపాడుకొంటూ వచ్చాడు డైరెక్టర్.  ప్ర‌తీ సీన్ చూసేవారు ముందుగానే ఊహించేస్తారు. కొన్నిచోట్ల లాజిక్ మిస్స‌యింది. ఒక ఎస్సై పోస్టులో ఉన్న స‌ప్త‌గిరి హోంమంత్రి త‌న తండ్రి అంటూ నాట‌కం ఆడే స‌న్నివేశాలు.. నాన్న‌కు ప్రేమ‌తో స్పూఫ్ అంత‌గా వర్కవుట్ కాలేదు.

శ‌ర్వానంద్ కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.  పోలీస్ పాత్ర‌లో చేసే సంద‌డి ప్రేక్ష‌కులకు కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. లావ‌ణ్య త్రిపాఠి గ్లామర్ గా కనిపించిందే తప్ప.. తన పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. అక్ష కేవలం ఒక పాటకే పరిమితమైంది. ష‌క‌ల‌క శంక‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, స‌ప్త‌గిరి చేసే సంద‌డి ప్రేక్ష‌కుల్ని అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. ర‌వికిష‌న్.. రేసు గుర్రంలో మాదిరిగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ పాత్ర‌లో ప‌స లేకుండా పోయింది.    కృష్ణుడ్ని దృష్టిలో ఉంచుకొని ద‌ర్శ‌కుడు.. హీరో పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే క‌థ విష‌యంలోనూ.. దాన్ని తీర్చిదిద్దిన తీరులో తడబడ్డాడు.

 +ప్లస్ పాయింట్స్

కామెడీ

హీరో క్యారెక్టర్

శర్వానంద్

-మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే

సెకండ్ హాఫ్ లో సాగదీత⁠⁠⁠⁠

RATING : 3.25 / 5

REVIEWER : NARENDRA

Leave a Reply

Your email address will not be published.