KESHAVA MOVIE REVIEW AND RATING

KESHAVA MOVIE REVIEW AND RATING

KESHAVA MOVIE REVIEW

Read latest movie review keshava 

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, ప్రియదర్శి

మ్యూజిక్: సన్నీ ఎమ్.ఆర్

డైరరెక్షన్: సుధీర్ వర్మ


రెగ్యులర్ సినిమాలకు భిన్నింగా… డిఫరెంట్ స్టోరీలతో సక్సెస్ సాధిస్తున హీరో నిఖిల్.  స్వామిరారా, సూర్య వర్సెస్ సూర్య, కార్తికేయ సినిమాలతో హిట్ కొట్టిన నిఖిల్.. మరోసారి డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల 
ముందుకు వచ్చాడు. అరుదైన గుండె జబ్బు, ఎక్కువగా ఆవేశపడలేని యువకుడిగా నటించాడు. రివెంజ్ కథతో తెరకెక్కిన కేశవ, మరోసారి నిఖిల్ మార్క్ చూపించిందా..? ఈ ప్రయోగంలో నిఖిల్ తన సక్సెస్ 
అయ్యాడా..? రివ్యూలో చూద్దాం..

ఆ భూతులు ఏంటి బన్నీ ?

స్టోరీ :

కాకినాడ లో లా ఫైనల్ అర్ చదువుతున్న పి. కేశవ శర్మ(నిఖిల్ సిద్దార్థ్) అరుదైన గుండె జబ్బుతో బాధ పడుతుంటాడు. అందరికీ ఎడమ పక్కన ఉండే గుండె, తనకు కుడి పక్కన ఉంటుంది. దీంతో ఏ మాత్రం 
ఆవేశపడినా, అలిసి పోయినా గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేశవ వరుసగా పోలీసులను చంపేస్తుంటాడు. మర్డర్ కు సంబంధించి చిన్న క్లూ కూడా ఇవ్వకుండ చనిపోయిన వారిని 
ఉరివేసి వెళ్లి పోతుంటాడు.  ఇదే సమయంలో కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్య  కాలేజీలో జాయిన్ అవుతంది.  కేశవను గుర్తుపట్టి అతనికి దగ్గరయ్యేందుకు యత్నిస్తుంటుంది. కానీ ఆమెను దూరం 
పెడుతుంటాడు కేశవ…
మరోవైపు ఈ సీరియల్ మర్డర్స్ మిస్టరీని ఛేదించేందుకు షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) రంగంలోకి దిగుతుంది. కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న షర్మిలకు కేశవ మీద డౌట్ వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య 
సమయంలో కేశవను అరెస్ట్ చేస్తుంది. తన పగ తీరకుండానే పోలీసులకు చిక్కిన కేశవ ఎలా ఎస్కేప్ అయ్యాడు..? అసలు కేశవ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..?  పోలీసులపైనే ఎందుకుపగపట్టాడు..? 
స్పెషల్ ఆఫీస్ షర్మిలా ఈ కేను ఎలా ఛేదించింది..? ఇన్ని మర్డర్లు చేసిన కేశవ చివరకు ఏమయ్యాడు..? అనేది మిగతా స్టోరీ.


ఎక్స్ పర్మెంట్ సినమాలు చేసినా.. లవర్ బాయ్ లా కనిపించే సిద్ధార్థ్ ఈసారి రఫ్ గెడ్డంతో కొత్తగా కనిపించాడు. ముఖ్యంగా సినిమా అంతా బరువైన ఎమోషన్ ను మోస్తున్నట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.  
హీరోయిన్ రీతూవర్మ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇషా కొప్పీకర్, పోలీస్ అధికారి పాత్రకు న్యాయం చేసింది. కామెడీకి 
పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్య అలరిచారు. నెగిటివ్ క్యారెక్టర్స్ లో రావురమేష్, అజయ్, బ్రహ్మాజీ బాగా చేశారు.
అద్భుతమైన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. సాధారణమైన రివెంజ్ స్టోరీని ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో చక్కగా చూపించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో  అర్థం లేని కామెడీ, రొమాంటిక్ సీన్స్ ఇరికించకుండా 
సినిమాను నడిపించాడు. స్టెప్ బై స్టెప్ స్టోరీని నడిపించి.. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ చెప్తూ  కథను మెల్లమెల్లగా రివీల్ చేశాడు. హీరో పగతీర్చుకుంటున్నాడని ముందుగానే చెప్పిన డైరెక్టర్..పోలీసులనే ఎందుకు 
చంపుతున్నాడన్న సస్పెన్స్ ను చివరి వరకు కొనసాగించాడు. ఫస్ట్ హాఫ్ లో పగడ్బంధిగా సాగిన స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ లో  నెమ్మదించింది.  ఐతే ప్రీ క్లైమాక్స్ నుంచి స్టోరీ మళ్లీ స్పీడ్ గా, థ్రిల్లింగ్ గా సాగుతుంది. 
దివాకర్ మణి సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. తన ఫ్రేమ్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ను క్యారీ చేశాడు. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయని చెప్పొచ్చు.

సమంత కాళ్ళు మొక్కిన అఖిల్ ! వీడియో చుడండి
ప్లస్ పాయింట్స్

నిఖిల్ నటన

స్క్రీన్ ప్లే

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ లో స్లో నేరేషన్
రేటింగ్:2.5/5

 
IF YOU LIKE ,HIT A LIKE

 

Leave a Reply

Your email address will not be published.