వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చిన ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొచ్చిన 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్  ఇటీవల వైజాగ్ లో జరిగింది.  కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్‌ కథానాయికలు.  మే 15న సోమవారం రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రానికి సంబంధించిన డీటైల్స్ ను వెల్లడించారు. ఈ సందర్భంగా…
నిర్మాత `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ

“ నూతన సంవత్సరాది హేవిళంబిని పురస్కరించుకుని మేం ఈ సినిమాకు ముహూర్తాన్ని  చేశాం. ఆ వెంటనే రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు రోజులు చిత్రీకరించాం. 

ఆ తర్వాత వైజాగ్ లో 11 రోజులు చిత్రీకరించాం. ఈ నెల  9 వరకు అక్కడే షూటింగ్ జరిగింది. కొంత టాకీ పార్ట్ తెరకెక్కించాం.

ఈ నెల 26 నుంచి హైదరాబాద్ లో నాలుగైదు రోజుల పాటు  మరో షెడ్యూల్ చేస్తాం. . ఆ తర్వాత జూన్ లో వైజాగ్, అరకులో కీలక పోర్షన్ ని తెరకెక్కిస్తాం. గతేడాది రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ’లో రామ్‌ను దర్శకుడు సరికొత్తగా చూపించారు. ఇప్పుడీ కొత్త చిత్రంలోనూ రామ్‌ లుక్, బాడీ లాంగ్వేజ్‌లను సరికొత్తగా చూపించనున్నారు“ అని తెలిపారు.
దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ – ‘‘మా హీరోగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘నేను శైలజ`తో మా కాంబినేషన్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ తాజా చిత్రం కోసం రామ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన లుక్ కి ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది. ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు’’ అని అన్నారు.
 శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

.​

Leave a Reply

Your email address will not be published.